రెంజల్ మండలంలోని కల్లాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు మొదటిరోజు హోమం రెండవ రోజు స్వామివారి కల్యాణ భజన కార్యక్రమం మూడవరోజు సామూహిక వ్రతాలు జరిపారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జంటలు పూజలు నిర్వహించారు గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలో పాల్గొన్నారు
గత 41 ఏళ్ల నుండి గ్రామంలో రథసప్తమి రోజు ఆడపడుచులు గ్రామస్తులు ఈ పండుగను కలిసికట్టుగా జరుపుకోవడం విశేషం గ్రామంలో పాడిపంటలు ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు ఈ వేడుకలను పురస్కరించుకొని గ్రామంలో జాతర ఏర్పాటు చేస్తారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం వేడుకల సందర్భంగా ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు పూజలో పాల్గొన్న భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించారు ఈ వేడుకల్లో నిర్వాహక ప్రతినిధులు బాలయ్య శంకర్ కిన్నెర మోహన్ గోండ్ల నాగరాజు తోకల ప్రవీణ్ ఎంపీటీసీ సంయుక్త మాజీ సర్పంచ్ మోహన్ మాజీ ఉపసర్పంచ్ జలయ్య జలయ రైతు సమన్వయ సమితి మాజీ కోఆర్డినేటర్ కాశం సాయిలు వడ్డెక్క మోహన్ సాయినాథ్ శ్రీనివాస్ పిల్లల సాయిలు ప్రసాద్ సందీప్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment