Saturday, 17 February 2024

అయోధ్యలో శ్రీరాముని దర్శనం చేసుకున్న మండల బిజెపి నాయకులు

 ఈనెల 13న అయోధ్యలోని శ్రీ బాల రాముని దర్శనానికి కమ్మర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి సుమారు 30 మంది బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రత్యేక రైలులో అయోధ్యకు బయలుదేరినట్లు బిజెపి కమ్మర్పల్లి మండలాధ్యక్షుడు కట్ట సంజీవి తెలిపారు శుక్రవారం శ్రీరాముని దర్శనం పూర్తిచేసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరినట్లు తెలిపారు అయోధ్య వెళ్ళడానికి నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు పంపించేందుకు ఎంతో చొరవ తీసుకొని మాకు అన్ని రకాలుగా సహకారాన్ని అందించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యాత్రలో బీజేపీ కమ్మర్పల్లి మండల అధ్యక్షులు కట్ట సంజీవ్ చింత ప్రవీణ్ చింత లింగారెడ్డి రెంజర్ల గంగాధర్ కమల్ సిపూర్ గోవర్ధన్ పదం రమేష్ నిరంజన్ ఇంకా మరి కొంతమంది కార్యకర్తలు వెళ్లినట్లు తెలిపారు



No comments:

Post a Comment