మేడారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది భక్తి భావంతో పులకరించి పోతోంది జయ జయ దానాలతో మారుమోగుతోంది అటు జంపన్న వాగులో స్నానాలు ఇటు అమ్మల దర్శనానికి బారులు తొలిరోజు బుధవారం ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైనది గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు జంపన్నలు భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నార
అమ్మవార్ల దర్శనానికి లక్షలాదిగా తరలివస్తున్నారు దర్శనాలు కొనసాగుతున్నాయి ఇండియన్ అగ్రిటెక్ సంస్థ లక్ష్యనీటి సీసాలు స్వచ్ఛందంగా భక్తులకు అందజేసింది మేడారంలో మంత్రి దాన్సరి అనసూయ సీతక్కచేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు మేడారంలో పర్యావరణం దెబ్బతినకుండా కాలుష్య నియంత్రణ మండలి వ్యర్ధాలు చెత్త నిర్వహణ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయల పై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది కేంద్ర జౌళి శాఖ హరిత హోటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన కళలు చేతివృత్తుల ప్రదర్శనను మంత్రి సీతక్క ప్రారంభించారు పెద్ద సంఖ్యలో చిన్నారులు పెద్దలు తప్పిపోతున్నారు వీరిని గుర్తించేందుకు తప్పిపోయిన వ్యక్తుల గుర్తింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు
No comments:
Post a Comment