Thursday, 15 February 2024

వైభవంగా గట్టమ్మకు ఎదురు పిల్ల పండుగ

 మేడారం మహా జాతరకు ముందు జరిగే మండమెలిగే పండుగ రోజున ములుగు ఘట్టమ్మకు ఆదివాసీ నాయక కోడ్లు నిర్వహించే ఎదురు పిల్ల పండుగ బుధవారం వైభవంగా జరిగింది ఆదివాసి సంప్రదాయాల నడుమ డోలు వాయిద్యాలతో కులదైవాలైన లక్ష్మీదేవరాలను ప్రత్యేక నృత్యాలు చేస్తూ డోలు వాయిద్యాలతో వేడుకలు నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి గట్టమ్మ తల్లి ఆలయం వరకు జాతీయ రహదారిపై భారీ ర్యాలీగా తరలి వెళ్లారు మొదటి మొక్కుల తల్లి గట్టమ్మకు నాయకపోడు పూజారులు బోనాలతో నైవేద్యం సమర్పించారు ఈ తతంగం ఆసాంతం అబ్బురపరిచింది ములుగు జిల్లాలోని రొయ్యూరు సింగారం బూర్గుపేట చల్వాయి కొత్తపల్లి వెంకటాపూర్, సీతారాంపురం ఏటూరు నాగారం కమలాపూర్ వీరాపూర్ ముప్పనపల్లి కడేకల్ తదితర గ్రామాల నుంచి నాయక పోడులు లక్ష్మీదేవరాలతో తరలివచ్చారు ములుగు డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి అంతా కలిసి భారీ ర్యాలీగా గట్టమ్మ తల్లి చెంతకు బయలుదేరార 14 లక్ష్మీదేవరాలను ప్రత్యేకంగా అలంకరించి నృత్యాలు చేస్తూ వెళ్లిన నాయక పోడులు సాంప్రదాయ పద్ధతులు అమ్మవారిని కొలిచారు

 గట్టమ్మకు యాటమొక్కులు 

నాయక పోడు మహిళలు ములుగు నుంచి గట్టమ్మ వరకు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన 70 బోనాలతో తరలి వెళ్లి తల్లికి నైవేద్యాన్ని సమర్పించారు ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆధ్వర్యంలో పూజా సామాగ్రిని వెదురు బుట్టలు తీసుకువెళ్లి అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు పెట్టి ఒడి బియ్యం పోశారు ఎదురు పిల్ల పండుగ సందర్భంగా యాటపోతుల మొక్కులు చెల్లించారు అంతకుముందే గట్టమ పక్కనే ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సమీపడవల నుంచి తీసుకువచ్చిన కంకణాన్ని ప్రతిష్టించారు వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసి సేవా సంఘం నాయకపోడు సంఘం నాయకులు వారి కుటుంబ సభ్యులు సుమారు 1500 మంది తరలివచ్చారు అనంతరం ఆదివాసీల సమ్మేళనం కార్యక్రమాన్ని గట్టమ్మ సమీపంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారులు కొత్త సదయ్య కొత్త లక్ష్మయ్య ఆకుల మొగిలి అరిగెల సమ్మయ్య ఆదివాసి నాయకపొడి సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోన దయానంద స్వామి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైలర్ కూన ఆనంద్ రాష్ట్ర నాయకుడు పశువుల బుచ్చయ్య నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ గంటమూరి భాగ్యలక్ష్మి గొట్టెం భూమయ్య మందపల్లి భాస్కర్ దబ్బ శీను మాజీ సర్పంచులు భక్తుల లక్ష్మి చీర సారంగం పాలెం యాదగిరి కోట నరసింహ తదితరులు పాల్గొన్నార.

No comments:

Post a Comment