వెల్లడించిన చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి
హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అక్కలయ్య గుట్టపై శివలింగం ఇతర చిత్రాలు ఉన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి వెల్లడించారు అద్దలయ్య గుట్టను పద్మాక్షి గుట్టకు కలుపుతూ ఒక కోట గోడ నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయని రెండు గుట్టల నడుమ రాతి స్తంభాలతో నిలబెట్టిన తోరణ ద్వారం ఉందని వివరించారు ఈ ద్వారం సమీపంలో గుట్ట దిగువన శివలింగం డమరుకం దీపం గంటు చిత్రాలు వేయబడినట్లు తెలిపారు చాళుక్యుల కాలంలో 9 10 శతాబ్దాల నాటికి అగ్గలయ్యగుట్ట ప్రసిద్ధ జైనుల కేంద్రంగా విరాజిల్లిందని తెలిపారు కార్యక్రమంలో 11వ శతాబ్దం నాటికి కాకతీయులు పాలనలోకి వచ్చారని శైవమత ప్రాబల్యం పెరిగిందని చెప్పారు అందులో భాగంగానే అక్కలయ్య గుట్ట దిగువన శైవమత చిత్రాలు గీయబడినట్లు చిత్రాలు రోడ్డుకు పక్కనే ఉండటంతో రోడ్డు ఎత్తు పెరిగి ఈ చిత్రాలు కిందికి వెళ్ళాయని వివరించారు చిత్రాల రక్షణకు పురవస్తు శాఖ చర్యలు తీసుకోవాలని రెడ్డి రత్నాకర్ రెడ్డి కోరారు
No comments:
Post a Comment