Friday, 16 February 2024

రథసప్తమి 2024

 నాగశుద్ధ సప్తమి సూర్య జయంతి రథసప్తమిగా ప్రశస్తి పొందింది కశ్యపులకు సూర్యభగవానుడు జన్మించిన సుధీనమిది రథసప్తమి ఉత్తర గతిని సూచించే పండుగ రథసప్తమిని సూర్య జయంతి జయంతి సప్తమి మహాసప్తమి సౌర సప్తమి భాస్కర సప్తమి మొదలైన పేర్లతో విభిన్న ప్రాంతాల్లో పిలుస్తారు నిజానికి రథసప్తమి నుంచే ఆధిక్యుడు ప్రయాణం దక్షిణం నుంచి ఉత్తర దిశకు ప్రారంభమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రోజున స్వర్గస్తులైన పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు ఒకప్పుడు రథసప్తమిని ఉగాదిగా వ్యవహరించే వారట

సూర్యుడికి విశ్వకర్మ కూతురు సంజ్ఞ తో వివాహం జరిగింది భర్త తేజస్సు భరించలేని సంజ్ఞ కళ్ళు మూసుకుంది ఫలితంగా యముడు పుట్టాడు తర్వాత భర్తను చంచల దృష్టితో చూసింది తత్ఫలితంగా నిరంతరం ప్రవహించే నది రూపంతో యమునా జన్మించింది సూర్య తేజస్సుకు బెదిరిన సంజ్ఞ తన ఛాయను భర్త వద్ద ఉంచి వెళ్ళిపోయింది సూర్యుడికి ఈ విషయం తెలియదు ఛాయాసరీలకు కాలాంతరాన శని సావారిని అనే పుత్రులు తపతి అనే కూతురు జన్మించారు రథసప్తమి రోజున ప్రాతఃకాలంలోనే జిల్లేడు ఆకులు రేగుపండ్లు తల పైన ఉంచుకొని స్నానం చేస్తారు నేడు చేసే సముద్ర స్నానం శ్రేష్ఠమైనదని చెబుతారు నమస్కార ప్రియు బానుహు అన్నారు భాస్కరుడు విశ్వసాక్షి కర్మసాక్షి ప్రత్యక్ష సాక్షి మన పుణ్య పాపకర్మలన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాడు రామాయణ కాలంలో శ్రీరాముడు అగస్త్య మహర్షి నుంచి ఆదిత్య హృదయ స్తోత్రము ఉపదేశం పొంది రావణాసురుని సంహరించాడని పురాణ కథనం కుంతిదేవి సూర్య ప్రభావం సూర్య వరప్రభావం చేత కర్ణుని పుత్రుడిగా పొందింది. సత్రజిత్తు సూర్యారాధన చేసి శమంతకమణిని పొందగలిగాడు. ప్రసంగం మహర్షి సూర్య జపం చేసి చర్మవ్యాధి నుంచి విముక్తుడయ్యాడు భద్రేశ్వరుడు అనే రాజు ఆదిత్యున్ని ఆరాధించి శ్వేత కుష్టు వ్యాధి నుంచి చెబుతారు మయూరుడనే కవి సూర్యశతకం రాసి చర్మవ్యాధి పోగొట్టుకున్నట్లు మరో కథనం కాంభోజ దేశాధిపతి యశోధర్ముడు యాదిగ్రస్తుడైన తన పుత్రుడు చేత రథసప్తమి వ్రతం జరిపించి రాజ్య పట్టాభిషిక్తున్ని చేసినట్లు భవిష్య పురాణం చెబుతోంది బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఆవిష్కరించిన సూర్య సంబంధిత గాయత్రి మంత్రం మానవజాతికి మహిమాన్విత మోక్షమార్గ సూత్రం సూర్య కృప కోసం కొందరు ఆరున పారాయణం చేసే సంప్రదాయము ఉంది శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు అనన్య సామాన్యమైన సూర్యోపాసన చేశాడు హనుమ సూర్యుని గురువుగా స్వీకరించి సకల శాస్త్ర పారంగతుడయ్యాడు దినకరూపాసనతో సీతాదేవి ఆత్మస్థైర్యం పొందిందని యుద్ధకాండ చెబుతోంది ధర్మరాజుకు అత్యంత మహిమాన్వితమైన అక్షయపాత్రను అనుగ్రహించిన దివాకర్ణి సూర్య నమస్కారాలతో కొందరు పాసిస్తారు శైవ వైష్ణవులందరికీ ఆయన ఆరాధ్యుడే అఖిల ప్రాణికోటికి ప్రకృతికి జీవశక్తి చైతన్య స్ఫూర్తి ప్రసాదించేది ఆ వేద స్వరూపుడే పలు ప్రాంతాల్లో మహిళలు అనేక వ్రత విధానాలతో అంతర్యామిని అర్చిస్తారు పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు వ్రత చూడామని ధర్మసింధువు నిర్ణయామృతం వంటి అనేక గ్రంథాల్లో రథసప్తమి గురించి విస్తృత వర్ణన ఉంది తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ప్రభాకరుడికి ప్రణామం చేస్తే చాలు జన్మ చరితార్థం అవుతుందంటారు

No comments:

Post a Comment