Friday, 16 February 2024

సమ్మక్క సారలమ్మకు చందన సుగంధ మాలలు పట్టు వస్త్రాలు

 అమ్మలకు అరుదైన గౌరవ కానుక సమర్పించిన మంత్రి సీతక్క

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మలకు జాతీయ మిర్చి రాష్ట్ర ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన చందన మాలలు సుగంధ హారాలు పట్టు వస్త్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కచేతుల మీదుగా గురువారం మేడారంలో సమ్మక్క సారలమ్మ మన దేవతలకు సమర్పించారు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాంబశివరెడ్డి గురువారం ఉదయం ఆయన మండలం మేడారం సమ్మక్క సారమ్మలను దర్శించుకున్న అనంతరం మంత్రి చేతుల మీదుగా అమ్మలకు నూతన వస్త్రాలు చందన సుకందమాలలను సమర్పించారు సాంబశివరెడ్డి మాట్లాడుతూ అమ్మలను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు కేరళ రాష్ట్రం నుండి సుగంధ హస్త కళాకారులతో ప్రత్యేకంగా రూపొందించిన సుగంధ హా రాలు చందన మాలలు పట్టు వస్త్రాలను జాతర సమయంలో మంత్రి చేతుల మీదుగా అమ్మలకు బహుకరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ పిసిసి సభ్యురాలు రవళి రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కళ్యాణి ఉత్సవ కమిటీ చైర్మన్ లచ్చు పటేల్ నూతన కార్యవర్గ సభ్యులు వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్లు శేషారెడ్డి తిరుపతిరావు కార్తీక్ తదితరులు ఉన్నారు




No comments:

Post a Comment