బాలకొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో భగవత్ శ్రీ సత్యానంద మహర్షి గీతా భక్తజన ఆశ్రమ వజ్రోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి ఉదయం సత్యానంద మహర్షి ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ ఆచార్య శ్రీహరి తీర్థ స్వామి ఓంకార జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించారు అనంతరం కమలానంద భారతి స్వామి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా వజ్రోత్సవాల ప్రత్యేక చిత్రపటాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన మహాత్ములు పీఠాధిపతులు భక్తులనుదేశించి ప్రసంగించారు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత శ్లోకాలు దాని భావాలను భక్తుల వివరించారు నలుమూలల నుంచి వచ్చిన భక్తులు గీతా బోధనలను ఆలపించారు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి అనంతరం అన్నదానం నిర్వహించారు
No comments:
Post a Comment