Friday, 23 February 2024

కృష్ణ తీరంలో బాదామిచాలుక్య ఆలయాలు

 నల్లగొండ జిల్లా ముది మాణిక్యం గ్రామం చివర కృష్ణానది ఒడ్డునే ఉన్న బాదామి చాణుక్య శైలిలోని అరుదైన రెండు ఆలయాలు నీటికి పదిలంగా ఉన్నాయి ఈ విషయాన్ని తెలుగు యూనివర్సిటీ ఆర్కియాలజీ విభాగం పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీకి చెందిన డాక్టర్ ఎమ్మే శ్రీనివాసన్ ఎస్ అశోక్ కుమార్ల బృందం వెలుగులోకి తెచ్చింది. బాదామి చాలుక్య పాలనా కాలం అంటే క్రీస్తు శకం 543 నుంచి 750 మధ్యకాలంలో ఈ ఆలయాలను నిర్మించారు తెలంగాణలో అలంపూర్లో తప్ప బాదామి చాళుక్యులు ఆలయాలు చాలా తక్కువ సంఖ్యలోనే మిగిలి ఉన్నాయి ఈ గ్రామంలో దొరికిన మరో చారిత్రక ఆధారం 8 లేదా తొమ్మిదవ శతాబ్దానికి చెందిన భాదామే చాళుక్యుల చివరి కాలం నాటి లఘు శాసనం గండలోనర్రు అని రాసి ఉన్న లఘు శాసనం గ్రామంలోని అయిదుగుళ్లలో పంచకూట నీ ఒక గుడిలోని స్తంభం పై ఉన్నది ఇందులోని మొదటి రెండు అక్షరాలైన గండ కు అర్థం కన్నడలో వీరుడని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాకర్ మునిరత్నం భావిస్తున్నారు

No comments:

Post a Comment