త్రిపీటకాల్లో రెండవది అత్యంత ప్రాధాన్యత గలది సుత్తపీటకం. బహుజనుల హితం కొరకు బుద్ధ భగవానుడు ప్రవచించిన అన్ని సందేశాలను సమగ్ర రూపంలో ఈ పీఠకంలో సంకలన పరిచారు బుద్ధుని ముఖ్య శిష్యులైన సారి పుత్ర మౌడ్గల్యాయన ఆనందుల సందేశాలను కూడా కొన్నింటిని ఇందులో చేర్చారు. బుద్దుని మహాపరి నిర్వాణం తర్వాత మూడు నెలలకు రాజగృహంలో బుద్ధుని ముఖ్య శిష్యులైన మహా కాశ్యపుడు,ఆనందుడు, ఉపాలి వంటి వారితో ఒక సభ ఏర్పాటు ఐనది.ఆ సభ లోనే మొట్ట మొదటి సారిగా బుద్ధుని ఉపదేశాలను సంగ్రహ పరిచారు. సుత్త పీటకం లో ని బుద్ధుని అన్ని సందేశాలు ఆనందుడు విని చెప్పినట్లుగా ఉంటాయి అన్ని సందేశాలు ఏవం మే సుతం నేను ఈ విధంగా వినడం జరిగింది అని మొదలవుతాయి ప్రవచనాలన్నీ సందర్భానికి తగినట్లుగా వినేజనుల స్థాయిని దృష్టిలో పెట్టుకొని చెప్పినట్లుగా ఉంటాయి బుద్ధుడు తన ప్రవచనాలను కేవలం భిక్షువులనే కాకుండా సామాన్య ప్రజానీకాన్ని రాజులను వివిధ మత శాఖల వారిని ఉద్దేశించి చేశాడు పువ్వుల్ని ఒక దారం ఎలా మాలగా కలిపి ఉంచుతుందో బుద్ధ వచనాలను సుత్తిపీటకం అలా సంకలన రూపంలో కలిపి ఉంచింద.
సుత్తపీఠకం 5 ని కాయాలుగా విభజింపబడింది అవి దీర్ఘనికాయం మధ్యమని కాయం సంయుక్త నికాయం అంగత్తరని కాయం ఖుద్దక ని కాయం అంటే సమూహం
సుత్తపీఠకాన్ని అధ్యయనం చేయటం వల్ల బుద్ధుడు ప్రవచించిన ధార్మిక బోధలు ఆయన కాలం నాటి తాత్వికులు వారి తాత్విక సిద్ధాంతాలు తెలుస్తాయి
జ్ఞాన సమపార్చనకు బుద్ధుడు ఏ విధంగా శ్రమించింది ఎవరెవరిని కలిసింది చివరి రోజులు ఏ విధంగా గడిపింది తెలుస్తుంది ధ్యానానికి సంబంధించి బుద్ధుడు ప్రవచించిన ఆనాపానా సతి సూక్తం మహాసతి పఠాన సుత్ఇంతమ్ దులోనే ఉన్నాయి. ఇవేకాక ధర్మ చక్ర ప్రవర్తన సూత్రం మహాపరినిర్వాహణ సుత్తం కూడా సుత్తి పెట్టకంలోనే ఉన్నాయి సుత్తిపీటకంలో బుద్ధుడు ప్రతిపాదించిన ధర్మాన్ని గురించి సంక్షిప్తంగా చెప్పమంటే ఇలా చెప్పవచ్చు ప్రపంచంలో జీవితంలో దుఃఖం ఉంది ఆ దుఃఖానికి కారణం ఉంది దుఃఖం నుండి విముక్తి పొందే వీలు ఉంది దుఃఖం నిరోధానికి మార్గం ఉంది ఇవే నాలుగు ఆర్య సత్యాలు విముక్తి మార్గాన్ని అష్టాంగ మార్గం అంటారు ఈ మార్గమే బౌద్ధులకు శిరోధార్యం.
No comments:
Post a Comment