ప్లాస్టిక్ తేవద్దు అమ్మొద్దు వాడొద్దు స్లోగంతో అవగాహన విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆఫీసర్లు ఇప్పటికీ రెండు చెక్‌పోస్టుల ఏర్పాటు మేడారం మహా జాతరను ఈసారి ప్లాస్టిక్ ఫ్రీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రెండేళ్లకోసారి మహా జాతర అయిపోగానే మేడారం మొత్తం ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోతుంది దీంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా వ్యర్ధాలను తిని వందలాది పశువులు అటవీ జంతువులు చనిపోతున్నాయి ఈ క్రమంలో సమ్మక్క జాతరను పర్యావరణహితంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఈసారి ప్లాస్టిక్ ను పూర్తిగా నివారించేలా చర్యలు తీసుకుంటున్నారు మేడారంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు బ్యాగులు వాడకూడదని భక్తులు కూడా ప్లాస్టిక్ కవర్లు బ్యాగులు, దేవద్దని సూచిస్తున్నారు ప్లాస్టిక్ కు బదులు జ్యూట్ కాటన్ బ్యాగులు వాడాలంటూ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నారు మేడారానికి వచ్చే వెహికల్స్ చెక్ చేసి ప్లాస్టిక్ కవర్లు ఉంటే స్వాధీనం చేసుకుని జ్యూట్ బ్యాగులు అందజేస్తున్నారు శబరిమల విధానంపై స్టడీ మేడారం మహా జాతరకు ప్రపంచం నలుమూలల నుంచి కోటిన్నర మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది జాతరలో ప్లాస్టిక్ కవర్లు గ్లాసుల వాడకంతో పర్యావరణం దెబ్బతింటుంది శబరిమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని కేరళ ప్రభుత్వం పూర్తిగా ఆపేయ కలిగింది అక్కడ అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసేందుకు 2017లో అప్పుడు ములుగు సబ్ కలెక్టర్ గా ఉన్న ప్రస్తుత ఖమ్మం కలెక్టర్ బిపి గౌతమ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం శబరిమలను విజిట్ చేసింది అక్కడికి కోట్లాదిమంది వస్తున్న ఎక్కడా ప్లాస్టిక్ వస్తువు అన్నదే కనిపించదు. ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వెహికల్స్ తనిఖీ చేసి ప్లాస్టిక్ వస్తువులు ఉంటే స్వాధీనం చేసుకుంటారు పార్టీకి బదులు పర్యావరణానికి చేటు చేయని వస్తువులను ఇస్తారు ఇందుకోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తారని మేడారంలోను ఈ విధానాన్ని అమలు చేయాలని టీం సూచించింది కమిటీ సిఫార్సుల మేరకు 2020 మహా జాతరలో ప్లాస్టిక్‌ను నివారించేందుకు అప్పటి కలెక్టర్ నారాయణరెడ్డి ఏర్పాట్లు చేశారు భక్తుల్లో అవగాహన కోసం ఘట్టమ్మ దేవాలయం వద్ద ప్లాస్టిక్ వస్తువులతో కాలకేయ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు ఈనెల 21 నుంచి 24 వరకు మేడారం మహా జాతర జరిగింది అంతకన్నా రెండు నెలల ముందు నుంచే భక్తులు మేడారానికి తరలివస్తున్నారు ప్లాస్టిక్ నిరోధానికి తాడువాయి పస్రా రూట్ లో రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు వాహనాలను తనిఖీ చేసి ప్లాస్టిక్ కవర్లు తీసుకొని జ్యూట్ బ్యాగులు అందిస్తున్నారు. జాతరకు ప్లాస్టిక్ తీవద్దంటూ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ప్లాస్టిక్ ఫ్రీ జాతరకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కోడలపై పెయింటింగ్ చేయించారు ఆర్టీసీ బస్సుల వెనక పట్టణాల్లో రద్దీగా ఉండే చోట్ల బ్యానర్లు కడుతున్నారు ఒకవైపు అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటున్న మేడారంలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అమలు కావడం లేదన్న వాదన వినిపిస్తోంది ఇప్పటికే మేడారంలో వెలసిన షాపుల్లో బెల్లం కొబ్బరికాయలు పసుపు కుంకుమ అమ్మవారి పూజ సామాగ్రి ప్లాస్టిక్ కవర్లలోనే అమ్ముతున్నారు వ్యాపారులు దొంగ చాటుగా ప్లాస్టిక్ కవర్లు తరలిస్తున్నారు అని తెలుస్తోంది మేడారం వెహికల్స్ కు పర్యావరణ పనులు రద్దు పర్యావరణాన్ని కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్తున్న భక్తుల వెహికల్స్ కు పర్యావరణ పన్ను ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఫీజును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు ఈ నెల రెండు నుంచి29 వరకు పన్ను వసూలు నిలిపి వేస్తున్నట్లు గురువారం స్పష్టం చేశారు ఈ మేరకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉందని జాతరకు వచ్చేవారు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని మంత్రి సురేఖ కోరారు నాగారం అభయారణ్యం పేరుతో మేడారం వచ్చే భక్తుల నుంచి అటవీ శాఖ పన్ను వసూలు చేస్తోంది నాగారం రోడ్లలో ప్రయాణించే వెహికల్ ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది కారు ఆటోలకు 50 రూపాయలు ప్రైవేట్ బస్సులకు వంద రూపాయల చొప్పున తీసుకుంటుంది ఇలా వచ్చే పైసలను అటవీ ప్రాంతాలు వన్యప్రాణుల రక్షణకు ప్లాస్టిక్‌ను తొలగించేందుకు అటవీ శాఖ వినియోగిస్తోంది అయితే వివిధ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జాతర ముగిసే వరకు పర్యావరణ పనులను నిలిపివేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు దీంతో జాతరకు వచ్చే వెహికల్స్ ఈజీగా మూవ్ అయ్యా అవకాశం ఉంది.
No comments:
Post a Comment