Monday, 19 February 2024

దైవచింతనతోనే భగవత్ సాక్షాత్కారం

 


మానవుడు ఉరుకుల పరుగులతో శతమాతమవుతున్న ప్రస్తుత తరుణంలో దైవచింతని తోటే భగవత్ సాక్షాత్కారం జరుగుతుందని తెలంగాణ సాధు పరిషత్ ప్రచార కార్యదర్శి శ్రీ రామకోటి జపాలికిత ప్రచారకుడు కామారెడ్డి శ్రీ కృష్ణానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీకృష్ణనంద స్వామి అన్నారు బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ శ్రీ సత్యానంద మహర్షి గీతాశ్రమ వజ్రోత్సవ వేడుకలు ఆదివారం తో ముగిశాయి ఈ సందర్భంగా పాలు రాష్ట్రాల పీఠాధిపతులు తీర్థ స్వాములు ఆధ్యాత్మిక ప్రచారంపై బోధించారు సంస్కృతి సంప్రదాయాలు కాపాడేందుకు ప్రతి హిందువు సంఘటితంగా ముందుకు వెళ్లాలని వివరించారు మాంసాహారం మాని సాత్విక ఆహారం వైపు వెళ్లాలని సూచించారు అనంతరం తీర్థ స్వాములకు పీఠాధిపతులకు భక్తులు కాళ్లు కడిగి పాదపూజ నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు అంతకుముందు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు చివరి రోజు వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది మఠాధిపతులు ఈ మధ్యలో ఉత్సవాల్లో కార్యక్రమంలో పాల్గొన్నారు గీతాశ్రమ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీత భక్త జనాశ్రమ సభ్యులకు భక్తులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు


No comments:

Post a Comment