Monday, 19 February 2024

జగద్గురు రామభద్రాచార్యకు జ్ఞానపీఠ అవార్డు రావడం

 


ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంస్కృత విద్వాంసుడు శతాధిక గ్రంథకర్త రామాచారిత మానస్ గ్రంథ సంపాదకుడు భారతీయ హిందూ ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త కవి రచయిత బహుభాషా వేత్త వచన వ్యాఖ్యాత తత్వవేత్త రామాయణ భాగవత కథా కళాకారుడు స్వరకర్త గాయకుడు నాటక రచయిత అయోధ్య పై సుప్రీంకోర్టులో జరిగిన వాదనలో కీలక చారిత్రక ఆధారాల్ని కోర్టుల సమర్పించి క్రియాశీలక భూమిక పోషించిన స్వామి రామభద్రాచార్య సంస్కృత సాహిత్యానికి చేసిన కృషిని గుర్తించి 2023 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షించదగిన విషయమని అస్మక చరిత్ర పరిశోధక మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కంకణాల రాజేశ్వర్ ఆదివారము ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ రామభద్రాచార్య 22 భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా కలిగిన వారిని అన్నారు మానసిక వికలాంగుల కొరకై విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని అంద విద్యార్థుల కొరకై తులసి పీఠాన్ని స్థాపించి ఛాన్స్లర్గా కొనసాగుతున్నారని రామభద్రాచార్య అందరూ అయినప్పటికీ రెండు కళ్ళు ఉన్నవారు కూడా చేయని పనిని రామభద్రాచార్య చేసి చూపించాడని వారి సేవలను కంకణాల కొనియాడారు


No comments:

Post a Comment