శంభో శంకర మహాదేవ ఆపదల నుంచి కాపాడు అంటూ వేడుకున్నారు ప్రత్యేకంగా అలంకరించిన నూతన రథంపై కొలువుదీరిన గంగా పార్వతీ సమేత స్వామి వారి ఉత్సవమూర్తులను భక్తితో కొలిచారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు అంతకుముందు రథంపై ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు భజనలు కోలాటాలతో శోభాయాత్ర సందడిగా సాగింది ఆలయం నుంచి తల్లి సమాధి చేరుకొని మంగళ హారతులు సమర్పించాక తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ కార్పొరేటర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ వేణు పాల్గొన్నారు శనివారం రుద్రాభిషేకం చక్రతీర్థం కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు
No comments:
Post a Comment