ముస్తాబైన జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం
జానకంపేట ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది నేటి నుంచి ఈనెల 25 వరకు వారం పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ అష్టముఖి కోనేరు ఆలయంలో ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు అందులో పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపై వెలసిన స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం కాక స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది చక్రతీర్థం జాతర శేష హోమం బలిహరణం సాయంత్రం కుస్తీ పోటీలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి
ఇలా చేరుకోవచ్చు నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి పది కిలోమీటర్ల దూరంలో జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది ఇక్కడికి బస్సు మార్గం ద్వారా వచ్చే వెసులుబాటు ఉంది బోధన్ బాసర భహింస వెళ్లే బస్సులు ఈ మార్గం ద్వారానే రాకపోకలు సాగిస్తుంటాయి ప్రతి 15 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది జానకంపేట ప్రధాన కూడలి నుంచి కాలినడక ఆటోల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు అటవీ ప్రాంతంలోని గుట్టపై ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారి ఆలయం ఉంది
No comments:
Post a Comment