Thursday, 22 February 2024

కిల్లా రామాలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

 డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో ఈనెల 19 నుండి 25 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి నిత్య హోమం మంత్రపుష్పం తీర్థప్రసాదాలు నిత్యాన్నదానంతో ప్రారంభమైన ఉత్సవాల్లో 23న రథోత్సవం కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రథోత్సవం ప్రారంభిస్తారని ఆలయ చైర్మన్ చింతయ్య తెలిపారు 21న నిత్య హోమం 22న గరుడోత్సవం 24న చక్ర తీర్థం కార్యక్రమాలు నిర్వహిస్తారని ఈ ఉత్సవాలకు డిచ్పల్లి ఇందల్వాయి నిజామాబాద్ సిరికొండ ధర్పల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని ఆలయ పండితులు వివరించారు గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ పంచాయతీ సిబ్బంది యూత్ కమిటీ సభ్యులు పాల్గొని సీతారామచంద్రస్వామి ఉత్సవాలు విజయవంతం చేయాలని వివరించారు


No comments:

Post a Comment