మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు వెళ్లలేని వారికోసం అమ్మవార్ల ప్రసాదాన్ని ఇంటికి అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు ఈ మేరకు ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవా విభాగం ద్వారా ఏర్పాట్లు చేశారు అమ్మవార్ల ప్రసాదం కోసం 2009 రూపాయలు చెల్లించి లాజిస్టిక్స్ కౌంటర్ వద్దకు వెళ్లి బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పేటీఎం ఇన్సైడర్ ద్వారా లేదా లాజిస్టిక్ ప్రతినిధికి చేరవాణిలో సమాచారం అందజేసి పేరు ఈమెయిల్ పూర్తి చిరునామా తెలియజేస్తే వారు దరఖాస్తు చేస్తారు ఇందులో బెల్లం తో పాటు కుంకుమ పసుపు పొట్లాలు ఉంటాయి వీటిని ప్రజాల ఇళ్ల వద్దకే తీసుకొచ్చి అందించనున్నారు ఈనెల 25 వరకు భక్తులు బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ అంశంపై బాన్సువాడ డిఎం సరిత దేవి మాట్లాడుతూ వివిధ కారణాలతో జాతరకు వెళ్లలేని భక్తులకు తమ ఇంటి వద్దకే ప్రసాదాన్ని అందించేలాజిస్టిక్స్ ద్వారా ఏర్పాట్లు చేశాం బుకింగ్లను ప్రారంభించాం జాతర ముగిసే వరకు ఈ అవకాశం ఉంటుంది భక్తులు సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు సమీపంలోని బస్టాండ్ లాజిస్టిక్ కేంద్రాలు 9154298730 కామారెడ్డి 9154298729 బాన్సువాడ నెంబర్లలో సంప్రదించి ప్రసాదాన్ని పొందాలి అని కోరారు
No comments:
Post a Comment