ఈసారి అత్యధికంగా 6, ఆర్టీసీ బస్సులు సీతక్క మేడారంలో ఆర్టీసీ బేస్ క్యాంపును ప్రారంభించిన మంత్రి నయా పైసా ఖర్చు లేని దర్శనం ఒక్క మేడారంలోని సాధ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా థర్డ్వాయి మండలం మేడారంలో శనివారం ఆమె పర్యటించారు సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం ఆర్టీసీ ఏర్పాటు చేసిన బేస్ క్యాంపు మంత్రి ప్రారంభించారు మేడారంలో 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండును టికెట్ కౌంటర్లు విశ్రాంతి గదులను ఏర్పాటు చేశామని ఈసారి అత్యధికంగా 6000 బస్సులు నడిపిస్తున్నామని మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి చెప్పారు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణ కమిషనర్ ఆర్ వి కర్ణంతో భక్తులకు వైద్య సౌకర్యాలపై మంత్రి సమీక్షించారు 40 బైక్ అంబులెన్స్ ప్రారంభించారు 50 పడకల తాత్కాలిక ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందని 24 గంటలు మెరుగైన అత్యవసర వై ద్య సేవలను అందిస్తామని మంత్రి చెప్పారు కాగా మేడారం జాతర నిర్వాణ కోసం ఐదుగురు ఐఏఎస్ అధికారుల నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ సిఎస్ శాంతి కుమారి జారీ చేశారు గతంలో మేడారం జాతర ప్రత్యేక అధికారిగా పనిచేసిన అనుభవమున్న ఆర్మీ కర్ణను ములుగు కలెక్టర్ గా రెండు మహా జాతర నిర్వహించిన అనుభవం ఉన్న ఎస్ కృష్ణ ఆదిత్యను గతంలో ములుగు కలెక్టర్ గా పని చేసిన ఆదర్శ సురభిని హనుమకొండ రంగారెడ్డి జిల్లాలో అదన కలెక్టర్లు రాధిక గుప్తా ప్రతిమ సింగల్ నియమించారు శనివారం వారు మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు శనివారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు మూడు లక్షల మంది దేవతలను దర్శించుకున్నారు ఆదివారం నుంచి ఆర్టీసీ పూర్తిస్థాయిలో సర్వీసులను అందుబాటులోకి తేనుండగా ప్రస్తుతం ఆయా డిపోల నుంచి వందలాది ప్రత్యేక బస్సులు మేడారానికి నడుస్తున్నాయి దేవాదాయ శాఖ అధికారులు మేడారంలో ఉండిలను ఏర్పాటు చేస్తున్నారు
మేడారం జాతరకు 30 ప్రత్యేక రైళ్లు మేడారం జాతరకు వెళ్లి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల నుంచి 30 ప్రత్యేక రైలు నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సికింద్రాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం నిజామాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపారు సికింద్రాబాద్ వరంగల్ మధ్య పది రైళ్లు సిరిపూర్ కాగజ్నగర్ వరంగల్ మధ్యన 8 రైలు నిజామాబాద్ వరంగల్ మధ్యన 8 ఆదిలాబాద్ వరంగల్ మధ్య రెండు ఖమ్మం వరంగల్ మధ్య రెండు రైలు నడుపుతున్నట్లు పేర్కొన్నారు
No comments:
Post a Comment