నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన తానూర్ గ్రామంలో గురువారం కూర బోనాల పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా మహాలక్ష్మి ఆలయంతో పాటు గ్రామంలోని ప్రధాన ఆలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు సాయంత్రం అమ్మవారికి శివశక్తుల పూనకాల పోతరాజులతో భాజా భజంత్రీలతో బోనాల పండుగ శోభయాత్ర వైభవంగా నిర్వహించారు అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమంలో మహిళలు మంగళ హారతులతో బోనాలతో పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొని గ్రామదేవతలకు బోనాలను సమర్పించారు ఈ సందర్భంగా గ్రామంలోని సకల సౌభాగ్యాలు చల్లంగా చూడాలని ఆ దేవున్ని వేడుకున్నారు ప్రతియటా అనవాయతిగా నిర్వహించే ఈ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమంలో మహిళలు మంగళ హారతులతో బోనాలతో పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొని గ్రామదేవతలకు బోనాలను సమర్పించారు ఈ సందర్భంగా గ్రామంలోని సకల సౌభాగ్యాలు చల్లంగా చూడాలని ఆ దేవుని వేడుకున్నారు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలను చేపట్టారు ఈ సందర్భంగా పుట్టింటి ఆడపడుచులు గ్రామానికి చేరుకొని బోనాల పండుగ శోభా ర్యాలీలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు ఆడపడుచుల రాకతో గ్రామంలో ఎటు చూసినా బోనాలు ఉర పండుగ శోభ సంతరించుకుంది పోతరాజుల నృత్యాలు చూపరులకు ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ తాడేవారు విట్టల్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పంగి పండరి ఉపాధ్యక్షుడు డి రాములు మాజీ సర్పంచ్ మాధవరావు పటేల్ డైరెక్టర్ పుండరీక్ నాయకులు శివాజీ పటేల్ గోవింద పటేల్ సోమనాథ్ భూమాన్న పోశెట్టి యోగేష్ సాయినాథ్ లక్ష్మణ్ సంతోష్ రాములు రాజు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు, భక్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment