భక్తులు అధికారులు సహకరించాలి మంత్రి సీతక్క మేడారం ఉత్సవ కమిటీతో ప్రమాణం అమ్మలను దర్శించుకున్న చందా వంశీయులు
మేడారం మహా జాతరను ప్లాస్టిక్ రహితంగా జరుపుకుందామని ఇందుకోసం భక్తులు అధికారులు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ తో కలిసి గురువారం ఆమె మేడారంలో సెక్టోరియల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈనెల 21 నుంచి ప్రధాన జాతర జరుగుతుండగా ఇప్పటికే లక్షలాదిమంది భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనానికి వస్తున్నారని పారిశుద్ధ్యం తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు జాతర జరిగే ప్రదేశాన్ని 10 సెక్టార్లు 60 సబ్ సెక్టార్లుగా విభజించామని అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు ఈనెల 19న అధికారులంతా జాతర విధుల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు జంపన్న వాగులో పుణ్యస్నానాల కోసం ఏర్పాటు పూర్తయ్యాయని ఎండలు ఎక్కువగా ఉన్నందున తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు కాక అల్లంమ్ లచ్చు పటేల్ చైర్మన్గా 13 మంది డైరెక్టర్లు ఒక ఎక్స్ అఫీషియల్ సభ్యుడుతో కూడిన మేడారం ఉత్సవ కమిటీ కొలుపు తీరింది వారితో మంత్రి సీతక్క పదవి ప్రమాణం చేయించారు కాగా వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రం ఉన్నతాధికారులు మేడారం వనదేవతలను దర్శించుకున్నారు భక్తులకు కల్పించే వైద్య సౌకర్యాలను సమీక్షించారు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ అకాడమిక్ డాక్టర్ శివరామకృష్ణ డిఎంహెచ్వో అప్పయ్యలతో కలిసి తాతకాలిక ఆసుపత్రి మెడికల్ క్యాంపులను పరిశీలించారు
No comments:
Post a Comment