Saturday, 2 March 2024

కమ్మర్ పల్లిలో బోనాల ఊరేగింపు

 కమ్మర్ పల్లి మండల కేంద్రంలో శుక్రవారం గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు బోనాల ఊరేగింపు గ్రామ ప్రధాన వీధులు జాతీయ రహదారి గుండా గుడి గుంట చెరువు ప్రాంతంలో నూతనంగా నిర్మించిన రజకుల ఆరాధ్య దైవం మడేలేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు ఆవుట్ల భాజన్న కోశాధికారి సుంకేట నరసయ్య సుంకట గంగాధర్ భాజన్న సంకట శ్రీనివాస్ రవి దశరథ్ సంకట రమేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు



No comments:

Post a Comment