జిల్లాలో సోమవారం మార్కండేయ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఉదయం నుంచి పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు పలు మండలాల్లో పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బిచ్కుందలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని పదో తరగతి ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు ఎల్లారెడ్డి లోని పద్మశాలి సంఘ సభ్యులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు మండల కేంద్రంలో పద్మశాలి కుల సంఘ భవనం నుంచి మార్కండేయ ఆలయం వరకు కలశాల ఊరేగింపు నిర్వహించారు ఆలయంలోని మార్కండేయ విగ్రహానికి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మద్నూర్లోని మార్కండేయ ఆలయంలో పూజలు చేశారు అనంతరం ఉయ్యాల సేవ నిర్వహించారు పిట్లంలో పద్మశాలి సంఘ సభ్యులు మహిళలు బోనాలతో మార్కండేయుడు చిత్రపటాన్ని రథంపై ఏర్పాటు చేసి కోలాటం ఆడుతూ బ్రహ్మంగారి ఆలయం నుంచి చెరువు కట్ట రామేశ్వర ఆలయం వరకు ఊరేగింపు చేపట్టారు అనంతరం ఆలయంలో మార్కండేయ జయంతి నిర్వహించారు పద్మశాలి సంఘాలు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి బాన్సువాడ మండలంలోని బొర్లం తాడుకుల్ గ్రామాల్లో మార్కండేయ జయంతిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు బోనాలతో మార్కండేయ మందిరం వరకు శోభాయాత్ర నిర్వహించి పూజలు చేశారు బోర్లలోని మార్కండేయ మందిరంలో మార్కండేయ స్వామి ఉత్సవ విగ్రహానికి తొట్టెల కార్యక్రమానికి వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పూజారి శ్రీధర్ పంతులు పద్మశాలి సంఘం పెద్దలు అన్నం హనుమాన్లు నాగయ్య పద్మ రమేష్ నాగభూషణం సుప్పని అంజయ్య బాబు నారాయణ బసవరాజ్ సుభాష్ ప్రవీణ్ కుమార్ వినయ్ సాయిబాబా పాల్గొన్నారు జంగంపల్లిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ చిత్రపటాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు పద్మశాలి సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంఘం సభ్యులు పాల్గొన్నారుబాన్స్వాడలోని మార్కండేయ ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గంగాధర్ రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి నాయకులు ఎజాజ్ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ కౌన్సిలర్లు కోఆప్షన్స్ సభ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు పాల్గొన్నారు బిబిపేట్ తో పాటు మాందాపూర్ రాజంపేట మండలం బసవన్నపల్లిలోని మార్కండేయ ఆలయంలో పూజలు నిర్వహించారు కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు లక్కపత్ని రవి కార్యదర్శి సామల బాలచంద్రం కోశాధికారి అరవింద్ సంఘ సభ్యులు భక్తులు పాల్గొన్నారు
దోమకొండలోని మార్కండేయ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగరాజు ఉపాధ్యక్షులు బొమ్మెర ప్రవీణ్ కుందన వినోద్ రాజేందర్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ అనిల్ జగదీష్ మహాదేవ్ కోశాధికారి గణేష్ నారాయణ సి డి సి చైర్మన్ ఐరన్ నరసయ్య పద్మశాలి కుల పెద్దలు చేనేత సహకార సంఘం సభ్యులు డైరెక్టర్లు మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి