భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకొని బాల్కొండ మండల కేంద్రంలోని మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం భక్త మార్కండేయ కండువాలను గ్రామ పద్మశాలి సంఘాలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాల్కొండ మండల అధ్యక్షుడు మానేటి నాగభూషణం మాట్లాడుతూ పద్మశాలి సంఘ సభ్యులు అందరూ సంఘటితంగా ఏర్పడి రాజకీయంగా సామాజికంగా ప్రతి సభ్యుడు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు బాల్కొండ పట్టణ అధ్యక్షుడు మధుకర్ మాట్లాడుతూ మార్కండేయ జయంతి సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ మందిరంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు మానేటి నాగభూషణం కార్యదర్శి రా రాజుల రామనాథం బాల్కొండ పట్టణ పద్మశాలి అధ్యక్షుడు ఎలిగేటి మధుకర్ కోశాధికారి రాజేందర్ సంయుక్త కార్యదర్శ తమ్మి కపిల్ సంఘ సభ్యులు నవీన్ సుమన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి