ఏరుగట్ల మండలానికి చెందిన పలువురు శ్రీరామ భక్తులు అయోధ్య శ్రీరాముని దర్శనానికి బయలుదేరి వెళ్లారు. భారతీయ జనతా పార్టీ ఏరుగట్ల మండల శాఖ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ లల్లా దర్శనానికి వెళ్లడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు లక్షలాది హిందువుల ఆకాంక్ష ఫలితంగా 22 జనవరి 24 రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శ్రీరాములల్ల ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగిందని అన్నారు మంగళవారం నిజామాబాద్ జిల్లా నుండి అయోధ్య దర్శనానికి 1000 మంది రామ భక్తులు బయలుదేరుతున్నార ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నిజామాబాద్ ఎంపీ అరవింద్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి