14, ఫిబ్రవరి 2024, బుధవారం

16న 7 వాహనాలపై మలయప్ప దర్శనం

 సూర్య జయంతి సందర్భంగా ఈనెల 16న రథసప్తమని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది ఒకేరోజు స్వామి వారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో ఈ రథసప్తమిని అర్థ బ్రహ్మోత్సవం ఒకరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొంటున్నారు భక్తులకు అవసరమైన ఏర్పాటు చకచకా పూర్తి చేస్తున్నారు రథసప్తమి రోజున ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేశారు భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన టైమ్స్ లాట్లను పాటించని పక్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు ద్వారా దర్శనానికి పంపుతారు ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు గదుల కేటాయింపు కోసం సిఆర్ఓ జనరల్ కౌంటర్లు మాత్రమే పని చేస్తాయి ఎంబీసీడీ కౌంటర్లను మూసివేస్తారు వాహన సేవలు ఇలా శ్రీ మల్లప్ప స్వామి వారు ఉదయం ఐదున్నర నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనాలపై భక్తులకు దర్శనం ఇస్తారు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు, సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనంపై సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్ర ప్రభాహనంపై భక్తులకు కటాక్షిస్తారు రథసప్తమి నాడు శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం ముంజలు సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది రథసప్తమికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ మల్లికా గారికి తెలిపారు మంగళవారం టిటిడి సిబిఎస్ఓ నరసింహ కిషోర్ తో కలిసి ఆమె తిరుమల లో ఏర్పాట్లను పర్యవేక్షించారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి