12, ఫిబ్రవరి 2024, సోమవారం

వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ కార్యక్రమం

 కోటగిరి మండల కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆదివారం పోతంగల్ మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వాసవి మాతకు మహిళలు కుంకుమార్చన హారతి తీర్థప్రసాదాలు సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా బచ్చు చంద్రశేఖర్ మాట్లాడుతూ మాఘమాసం శుక్లపక్షం రెండవ రోజు ఆత్మహర్పణ దినోత్సవం నిర్వహిస్తామని అన్నారు వాసవి మాత గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండ పవిత్ర స్థలంలో అమ్మవారు అగ్నిగుండంలో ప్రవేశించి ఆమె భౌతిక నివాసాన్ని విడిచిపెట్టిందని భూమిని విడిచి వెళ్లే ముందు తాను ఆదిపరాశక్తి దేవి అవతారం అని మహిళల గౌరవాన్ని ధర్మాన్ని కాపాడేందుకు వాసవి మాత అవతారంలో వచ్చిందని అన్నారు ఈ మాటను ఆర్యవైశ్య కులదైవంగా భావిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు హనుమాన్లు అర్జన్ కుమార్ సుభాష్ బచ్చు తిలక్ కిరణ్ లక్ష్మీకాంత్ ఆర్యవైశ్య సంఘం మహిళలు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి