12, ఫిబ్రవరి 2024, సోమవారం

ఇంటింటికి శ్రీరాముని లడ్డూల పంపిణీ

 ఇంటింటికి అయోధ్యలోని శ్రీరాముని లడ్డూలు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రముఖ శాస్త్రవేత్త జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు శ్రీరామ తీర్థ ట్రస్ట్ సభ్యులు పైడి ఎల్లారెడ్డి చెప్పారు ఆదివారం ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మూడు లక్షల మందికి శ్రీరాముని అయోధ్య లడ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఎందుకోసం థర్డ్వాయి మండలం చిట్యాల గ్రామ సమీపంలో గల తమ ఫామ్ హౌస్ లో లడ్డూలను తయారు చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ శ్రీరాముని సేవకు అంకితం కావలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తాము పంపిణీ చేసే శ్రీరాముని అయోధ్య లడ్డూలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేయడం జరుగుతుందన్నారు పలు గ్రామాలలో తన సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన వంతు కృషి ఎల్లవేళలా చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి