15, ఫిబ్రవరి 2024, గురువారం

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

 భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీకృష్ణ మందిరం 19వ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెల్లవారుజామున స్వామివారిని తీరకప్పులతో అందంగా అలంకరించి ప్రభాతభేరి ధ్వజారోహణము గోపూజ గీతా పారాయణం స్వామివారికి ప్రత్యేక పూజలు క్షీరాభిషేకం యజ్ఞము గణపతి పూజ పుణ్యాహవాచనము లక్ష్మీ సుదర్శన హోమము మంత్రపుష్పము భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆశ్రమ కమిటీ ప్రతినిధులు వార్షిక నివేదిక నిత్య పూజా పతకాన్ని భక్తులకు వివరించారు సాయంత్రం స్వామివారి పల్లకి సేవ రాత్రి ఆలయంలో భిక్కనూరు రాజంపేట దోమకొండ మండలాలకు చెందిన భజన మండలి సభ్యులతో భజన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి