పిట్లం మండల కేంద్రంలో పద్మశాలిల ఆరాధ్య దైవం మార్కండేయ జయంతిని పద్మశాలి కులస్తులు సంఘ సభ్యులు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయం నుండి మహిళలు కోలాటాలాడుతూ మార్కండేయ స్వామి చిత్రపటాన్ని రథంపై ఊరేగింపుగా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించగా ఈ రథయాత్ర శివాలయం వద్దకు చేరుకుంది ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు బాలరాజ్ మార్కండేయుని జీవిత చరిత్రను వివరించారు అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త పత్తి శ్రీనివాస్ మార్కండేయని జయంతిని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు మధురోహణ నరసింహులు మహిళలు యువకులు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి