14, ఫిబ్రవరి 2024, బుధవారం

కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభం గరుడ పతావిష్కరణ

 మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పదో వార్షికోత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు యాగశాల ప్రవేశం గరుడ పతావిష్కరణ ఎదుర్కోలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం స్వామి వారి మేలుకొలుపు తద్వారా యాగశాల ప్రవేశం చతుస్తనార్పణ అగ్ని ప్రతిష్ట సంతానం లేని వారికి గరుడ ముద్దులు అందజేసి ధ్వజస్తంభం వద్ద గరుడ కళ్యాణం గరుడ పటావిష్కరణ పూజ దేవత ఆహ్వానం పూజలు నిర్వహించారు సాయంత్రం మంగళహారతులతో భజన సంకీర్తనల్లో గ్రామ వీధుల గుండా స్వామి వారిని విష్ణు సహస్ర పారాయణం చేస్తూ ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు అనంతరం భక్తులకు అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి