13, ఫిబ్రవరి 2024, మంగళవారం

సిద్దుల గుట్టపై ఘనంగా పల్లకి సేవ

 ఆర్మూర్ పట్టణంలోని నవనాశ సిద్దుల గుట్టపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శివాలయంలోని సిద్దేశ్వరునికి ప్రత్యేక పూజలు పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు గుట్టపై గల శివాలయంలో రామాలయంలో దత్తాత్రేయ అయ్యప్ప స్వామి దుర్గామాత ఎల్లమ్మ తల్లి ఏకశీల స్తంభం వద్ద హనుమాన్ ఆలయాలలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్మూర్ భజన మండలి సభ్యులు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు కుట్టపై ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బి సుమన్ బీసీ గంగారెడ్డి గంగా కిషన్ బోన్ల ఆనంద్ కొడిగెల మల్లయ్య నక్కల లక్ష్మణ్ మీనా చంద్ అయ్యప్ప శ్రీనివాస్ చిన్నారెడ్డి సిద్ధిరగుట్ట సేవా సమితి సభ్యు లు పాల్గొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి