14, ఫిబ్రవరి 2024, బుధవారం

ఘనంగా శ్రీ జగదాంబ దేవి జాతర

 మామడ మండలంలోని కిషన్రావుపేట్ చెరువు మీద తండాలో శ్రీ జగదాంబ దేవి జాతరను మంగళవారం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి తండావాసులు ప్రత్యేక పూజలు జరిపారు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి దయతో నిర్మల్ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మామడ ఎంపీపీ అమృత జై సింగ్ నాయకులు వికాస్ రెడ్డి రాథోడ్ వసంతరావు రమణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రఫీ వసంత్ బాపయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం జాతర మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి