నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాకుండా వివిధ మండలాల భక్తులు వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీరుస్తూ కొంగుబంగారం కొచ్చేరి మైసమ్మ తల్లి నిలుస్తుంది అన్నారు అనంతరం భక్తుల కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణంలో సహపంక్తి భోజనాలు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి