15, ఫిబ్రవరి 2024, గురువారం

జోగులాంబ దేవి నిజరూప దర్శనం

 జోగులాంబ శక్తి పీఠం అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ దేవి బుధవారం భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు తీసుకువచ్చిన ఒక వెయ్యి ఎనిమిది కలశాలతో అమ్మవారికు అభిషేకాలు నిర్వహించారు ఏడాదికి ఒకసారి మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుందని 35000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఇవ్వు పురేందర్ కుమార్ తెలిపారు జోగులాంబ సేవాసమితి ఆధ్వర్యంలో అష్టభుజి జోగులాంబ సమేత గంటలేశ్వర ఆలయం నుంచి కలశాలతో ఊరేగింపు నిర్వహించారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి