ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఇవ్వాల్టి నుంచి 25 వరకు బుకింగ్స్ మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఇంటికే ప్రసాదం అందించేందుకు ఆర్టిసి ఏర్పాటు చేసింది ఈ మేరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ కుదరచుకుంది దేవస్థానం నుంచి అమ్మవారిల ప్రసాదంతో పాటు పసుపు కుంకుమ ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు అందజేయనుంది మేడారం మహా జాతర ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుండగా ఉండగా బుధవారం నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్ ఆఫ్లైన్లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది భక్తులు 2009 రూపాయలు చెల్లించి సమీపంలోని ఆర్టీసీ కార్గో ఏజెంట్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు ఇవ్వబడిన లింకు. Https ://rb.gy/q5rj68 పై క్లిక్ చేసి లేదా పేటీఎం ఇన్సైడర్ యాప్ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వచ్చని మంగళవారం ఆర్టిసి ఓ ప్రకటనలో తెలిపింది ఆన్లైన్ బుకింగ్ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా పిన్కోడ్ ఫోన్ నెంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు మేడారం ప్రసాదం బుకింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గాని ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో జీరో సిక్స్ నైన్, 0 4 0 6 9 4 4 0 000, 0 4 0 2 3 4 5 0 0 3 3 లను సంప్రదించాలని ఆయన సూచించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి