సోమవారం నుంచి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల ఎదురు కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు స్వస్తిశ్రీ శోభక్తునామ సంవత్సరం మాఘమాసం శుక్ల దశమి 2024 ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు ఎదురుకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు చెప్పారు సోమవారం రోజున విశ్వేశ్వర ఆరాధన దీపారాధన పుణ్యహవచనం అంకురార్పణం అగ్ని ప్రతిష్ట ద్వజారోహణం దేవతా హోమం బలి ప్రధానం మంగళవారం ఏకాదశి రోజున స్వామివారికి హోమం బలి ప్రధానం డోలారోహణం సాయంత్రం ఉయ్యాల సేవ పల్లకి సేవలో ప్రదక్షిణ భజన కార్యక్రమం బుధవారం రోజు ఉదయం 10:30 గంటలకు శ్రీవారి కల్యాణం మధ్యాహ్నం మహా పూర్ణాహుతి రథోత్సవం దేవతో ద్వాసనం ఉద్వాసన బలి ప్రధానం క్షేత్రపాలక బలిదానం మహాద్వాసి వచనం రుత్విక్ సన్మానం మరియు మధ్యాహ్నం నుంచి స్వామి దర్శనానికి విచ్చేసి భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సత్రం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు స్వామివారి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ వారు విన్నవించారు స్వామివారి ఉత్సవాలు భాగంగా బుధవారం చివరి రోజున తూంపల్లి నుంచి ఎదురుకొండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఆర్టీసీ వారు కల్పించినట్లు ఆలయ కమిటీ వారు తెలిపరు
No comments:
Post a Comment