తిరుమలలో ఈనెల 16న రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు భక్తుల కోసం అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు స్థానిక అన్నమయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు శ్రీ మళయప్ప స్వామి ఆరోజు సూర్యప్రభ చిన్న శేష గరుడ హనుమంత కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు అని తెలిపారు శ్రీవారి సేవకు అన్యమాతస్తులను అనుమతిస్తారా అని తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన హుస్సేన్ భాష అనే భక్తుడు అడిగిన ప్రశ్నకు ఈవో సమాధానం ఇస్తూ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని అన్నారు ఇప్పటికే డి క్లరేషన్ తీసుకుని దర్శనానికి అనుమతిస్తున్నామని గుర్తు చేశారు
ఆర్జిత సేవలు రద్దు.. రథసప్తమిని పురస్కరించుకుని ఈ నెల 15 16 17 తేదీల్లో ఎస్ఎస్డి టోకెన్లు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ధర్మారెడ్డి ప్రకటించారు ఈ నెల 14న తెల్లవారుజామున 12 గంటల నుంచి 16న అర్ధరాత్రి 12 గంటల వరకు టీబీ ఎంబీసీ 34 కౌంటర్లు మూసేసి సిఆర్ఓ శ్రీ పద్మావతి విశ్రాంత భవనాల సముదాయంలో మాత్రమే గదుల కేటాయింపు చేస్తారని వివరించారు.
No comments:
Post a Comment