మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బుధవారం మేడారం కన్నెపల్లిలో మండపల్లి గే కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారు ఆలయాలను శుద్ధి చేసి డోలు వాయిద్యాలతో పూజారులు అమ్మవారి గుడి చేరుకున్నారు మేడారం సమ్మక్క గుడిలో శక్తి పీఠాన్ని పవిత్రమైన పుట్ట మట్టితో అలికారు సమ్మక్క ప్రధాన పూజారి మునీందర్ ఇంటి నుంచి పసుపు కుంకుమలు తీసుకువచ్చి గుడికి చేరుకున్నారు. సమ్మక్క ప్రధాన ద్వారం తూర్పు ప్రవేశ మార్గంలో మామిడి తోరణానికి సొరకాయ కోడి పిల్ల కంటి నిలిపారు. సమ్మక్క పూజారులు మునీందర్ మల్లెల ముత్తయ్య కొక్కెర కృష్ణయ్య దశరథం వడ్డే నాగేశ్వరరావు చలిగంజి కోడి శాఖ కల్లు ధూపంతో మూడుసార్లు తోరణం కింద రోడ్డు అడ్డంగా ఆరాగింపు చేశారు పడమర ప్రవేశ మార్గంలో కూడా ఇదే తీరుగా పూజలు నిర్వహించారు కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయ మార్గంలో మామిడి తోరణాలు కట్టి పూజారులు కూడా వారి చేతులకు కంకణాలు కట్టుకున్నారు ఈ కార్యక్రమాలతో మేడారం మహా జాతర మొదలైందని పూజారులు తెలిపారు మేడారానికి భక్తులు పోటెత్తారు మండ మెలిగే ఉండడంతో అమ్మవార్లకు పెద్ద ఎత్తున మొక్కులు సమర్పించుకున్నారు



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి